గోపిచంద్ మలినేని

Wednesday,December 30,2020 - 01:01 by Z_CLU

గోపీచంద్ మలినేని ప్రముఖ దర్శకుడు. మార్చ్ 13 న, ఒంగోలు లో జన్మించారు. గోపీచంద్ మలినేని మొదట శ్రీహరి కథానాయకుడిగా తెరకెక్కిన ‘పోలీస్’ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడుగుగా పనిచేశారు. ఈ చిత్రం తరువాత ప్రముఖ దర్శకుడు ఈ.వి.వి.సత్యనారాయణ, శ్రీను వైట్ల, ఏ.ఆర్. మురుగదాస్, మెహెర్ రమేష్, శ్రీవాస్, వంటి దర్శకుల దగ్గర పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసారు.

రవితేజ దర్శకుడిగా తెరకెక్కిన ‘డాన్ శీను’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత వెంకటేష్ కథానాయకుడిగా బాడీగార్డ్, రవితేజ కథానాయకుడిగా ‘బలుపు’, రామ్ కథానాయకుడిగా ‘పండగ చేస్కో’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

ఆ తర్వాత సాయితేజ్ కథానాయకుడిగా ‘విన్నర్’ సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా క్రాక్ సినిమాను డైరక్ట్ చేశాడు గోపీచంద్ మలినేని.

సంబంధిత వార్తలు