గోపీచంద్

Thursday,January 07,2021 - 12:14 by Z_CLU

గోపీచంద్  ప్రముఖ కథానాయకుడు. జూన్ 12 ,1979 లో జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు అందుకున్న టి.కృష్ణ కుమారుడిగా ‘తొలి వలపు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కు హీరో గా పరిచయం అయ్యారు గోపీచంద్. ఈ సినిమా తర్వాత ‘జయం’, ‘వర్షం’, ‘నిజం’ సినిమాలలో విలన్ గా నటించాడు. ఈ సినిమాల తర్వాత హీరోగా కంటిన్యూ అయ్యారు.

గోపీచంద్  ‘యజ్ఞం’, ‘ఆంధ్రుడు’, ‘రణం’, ‘ఒక్కడున్నాడు’, ‘లక్ష్యం’, ‘గోలీమార్’, ‘సాహసం’, ‘జిల్’ సినిమాలతో హీరోగా పలు విజయాలు అందుకొని గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.

సంబంధిత వార్తలు