జి. నాగేశ్వరరెడ్డి

Thursday,December 15,2016 - 04:41 by Z_CLU

జి. నాగేశ్వరరెడ్డి ప్రముఖ దర్శకుడు. మొదట ఎస్.వి.కృష్ణా రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘మాయలోడు’, ‘యమలీల’ ,’శుభ లగ్నం’.’నంబర్ వన్’,’ఘటోత్కచుడు’,’వజ్రం’,’మావి చిగురు’ సినిమాలకు దర్శకత్వశాఖలో పనిచేశారు. ‘6 టీన్స్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ఇదే నా మొదటి ప్రేమ లేఖ’,’గర్ల్ ఫ్రెండ్’,’ఒక రాధ ఇద్దరు కృష్ణులు’,’సీత మా లక్ష్మి’,’గుడ్ బాయ్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘సీమ శాస్త్రి’ ,’సీమ టపాకాయ్’,’దేనికైనా రెడీ’,’కరెంట్ తీగ’,’ఆటాడుకుందాం రా’,’ఈడో రకం ఆడో రకం’ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తో పాటు పలు విజయాలు అందుకున్నారు.