డా.రాజశేఖర్

Wednesday,December 09,2020 - 06:16 by Z_CLU

డాక్టర్ రాజశేఖర్ ప్రముఖ ప్రముఖ నటుడు. తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు. మొదటి చిత్రం ‘వందేమాతరం’. రాజశేఖర్ 1962, ఫిబ్రవరి 4 న తమిళనాడు రాష్ట్రంలో లక్ష్మీపురంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు శేఖర్, ఆండాళ్ పిళ్ళై. సినిమాల్లోకి రాకమునుపే వైద్యవిద్యనభ్యసించాడు. చెన్నైలో కొంతకాలం డాక్టర్ గా ప్రాక్టీసు చేశాడు. 1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దురు కూతుర్లు – శివాని, శివాత్మిక. రాజశేఖర్ ఆవేశపరుడైన యువకుని (యాంగ్రీ యంగ్‌మాన్) పాత్రలకు ప్రసిద్ది. రాజశేఖర్ నటించిన పాత్రకు సాయి కుమార్ గాత్రదానం చేశాడు.

సంబంధిత వార్తలు