దేవ కట్టా

Friday,October 01,2021 - 12:56 by Z_CLU

ప్రేక్షకుల్ని మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్న అతి కొద్ది మంది దర్శకుల్లో దేవ కట్టా ఒకరు. వెన్నెల అనే సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యాడు దేవ కట్టా. ఆ సినిమాతోనే యూత్ ను ఎట్రాక్ట్ చేశాడు. ఆ తర్వాత తీసిన ప్రస్థానం సినిమాతో టాప్ డైరక్టర్ అయిపోయాడు. ఇప్పటికీ టాలీవుడ్ మోస్ట్ క్రిటికల్లీ ఎక్లయిమ్డ్ మూవీస్ లో ప్రస్థానం ఉంటుంది. ఈ సినిమాకు నంది అవార్డు తో పాటు ఫిలింఫేర్ అవార్డ్ వచ్చింది.

ఈ సినిమా తర్వాత ఆటోనగర్ సూర్య, డైనమేట్ సినిమాలు తీశాడు దేవ కట్టా. తర్వాత బాలీవుడ్ కు వెళ్లాడు. తనకు ఎఁతో పేరు తెచ్చిపెట్టిన ప్రస్థానం సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ కు వచ్చి సాయి ధరమ్ తేజ్ హీరోగా రిపబ్లిక్ సినిమా చేశాడు.

సంబంధించిన చిత్రం