దాసరి నారాయణ రావు

Friday,July 15,2016 - 12:57 by Z_CLU

దాసరి నారాయణ రావు తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర దర్శకుడు.మే 4 న పాలకొల్లు లో జన్మించిన. తెలుగు, హిందీ భాషల్లో కలిపి 151 సినిమాలకు దర్శకత్వం వహించారు. దర్శకత్వం తో పాటు కొన్ని సినిమాలలో నటుడి గాను అలాగే నిర్మాతగానూ వ్యవహరించారు. తెలుగు లో ఎందరో నటీ నటులను పరిచయం చేసి దర్శకుడి గా ఎన్నో ఘన విజయాలు అందుకున్నారు. ‘తాత మనవడు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన దాసరి తెలుగు లో ఎన్నో అఖండ విజయాలు అందుకున్నారు. తెలుగు లో ‘సంసారం సాగరం’,’బంట్రోతు భార్య’,’ఎవరికీ వారే యమునా తీరే’,’రాధమ్మ పెళ్లి’,’స్వర్గం నరకం’,’బాలి పీఠం’,’దేవుడే దిగి వస్తే’, ‘మనుషులంతా ఒక్కటే’,’ముద్దబంతి పువ్వు’,’యవ్వనం కాటేసింది’, ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’,’జీవితమే ఓ నాటకం’,’దేవదాసు మాలీ పుట్టాడు’,’కటకటాల రుద్రయ్య’, ‘శివరంజని’,’గోరింటాకు’, ‘కళ్యాణి’, ‘నీడ’, ‘బుచ్చి బాబు’, ‘ఏడంతస్తుల మీద’,’అడ్డాల మేడ’, ‘ప్రేమాభిషేకం’,’ప్రేమ మందిరం’,’బొబ్బులి పులి’,’స్వయం వరం’, ‘మజ్ను’, ‘బ్రహ్మపుత్రుడు’, ‘అమ్మ రాజి నామ’,’ఒరేయ్ రిక్షా’,’ ఒసేయ్ రాములమ్మ’,’తాండ్ర పాపా రాయుడు’ వంటి ఎన్నో సినిమాలతో దర్శకుడిగా అద్భుత విజయాలు అందుకున్నారు. నటుడిగా ‘సూరి గాడు’,’మామ గారు’,’కంటే కూతురునే కను’,  ‘మేస్త్రి’   వంటి పలు చిత్రాల్లో నటుడిగా పలు అవార్డులను అందుకున్నారు. దాసరి నారాయణ రావు దర్శకుడిగా రెండు నేషనల్ అవార్డులను, తొమ్మిది నంది అవార్డులను, ఆరు ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు పలు పురస్కరాలను అవార్డులను సొంతం చేసుకున్నారు.

Born : 4 May 1947