డి.సురేష్ బాబు

Thursday,November 03,2016 - 07:31 by Z_CLU

దగ్గుబాటి సురేష్ బాబు డిసెంబర్ 24 న జన్మించారు. సురేష్ బాబు ప్రముఖ నిర్మాత మూవీ మొఘల్ డా.దగ్గుబాటి రామానాయుడు తనయుడు. తండ్రి తెలుగు చిత్ర పరిశ్రమ లో అగ్ర నిర్మాత కావడంతో సురేష్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ‘బొబ్బిలి రాజా’ చిత్రం తో నిర్మాతగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత ‘కూలి నంబర్ 1′,’సూపర్ పోలీస్’, ‘ప్రేమించుకుందాం రా’,’గణేష్’, ‘కలిసుందాం రా’, ‘జయం మనదేరా’, ‘నువ్వు లేక నేను లేను’,’మల్లీశ్వరి’,’తులసి’,’దృశ్యం’,’గోపాల-గోపాల’ చిత్రాలతో నిర్మాతగా గుర్తింపు పొందిన సురేష్ బాబు ‘అష్ట చమ్మ’,’గోల్కొండ హై స్కూల్’,’ఈగ’,’ఉయ్యాలా జంపాల’,’పెళ్లి చూపులు’ చిత్రాలతో సమర్పకుడిగా విజయాలు అందుకున్నారు. సురేష్ బాబు నిర్మాతగా 4 నంది అవార్డులతో పాటు నేషనల్ ఫిలిం అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం సురేష్ బాబు ప్రముఖ నిర్మాతగా ,సమర్పకుడిగా కొనసాగుతూ రామానాయుడు స్టూడియో భాద్యతలు చూసుకుంటున్నారు.

Born : December 4th