చిరంజీవి

Wednesday,November 04,2020 - 02:30 by Z_CLU

కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) ఆగస్టు 22న 1955 లో జన్మించారు. ‘పునాదిరాళ్లు’ చిత్రంతో కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమ కి పరిచయమై అతి తక్కువ సమయం లోనే వరుస విజయాలు అందుకొని తన నటన, డాన్సులతో మెగాస్టార్ గా ఎదిగారు. ‘ఖైదీ’, ‘శుభలేఖ’, ‘విజేత’, ‘ఆపద్బాంధవుడు’, ‘స్వయంకృషి’, ‘ముఠా మేస్త్రి’ వంటి వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి ఎన్నో ప్రతిషాత్మక పురస్కారాలను, అవార్డులను,రికార్డులను సొంతం చేసుకున్నారు. తొలి సారి గా సౌత్ లో ‘ఘరానా మొగుడు’ సినిమాకు గాను కోటి రూపాయల పారితోషకం అందుకొని రికార్డ్ సాధించారు. చిరంజీవి ఇప్పటి వరకూ 150 సినిమాలలో నటించి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు ను అందుకున్నారు.. సినిమా రంగం తో పాటు రాజకీయ రంగం లో కూడా ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ ను స్థాపించి ఆ తరువాత ఆ పార్టీ ను కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసి కాంగ్రెస్ పాలనలో మంత్రి గా కొనసాగారు. రాజకీయాలతో బిజీ గా ఉండడం వల్ల కథానాయకుడిగా కొన్నేళ్ల గ్యాప్ తీసుకున్న చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Born : 22 August 1955

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు