బెల్లంకొండ శ్రీనివాస్

Thursday,November 12,2020 - 12:10 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రముఖ కథానాయకుడు. ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ తనయుడిగా తెలుగు సినీ రంగానికి ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి శ్రీనివాస్ కు హీరోగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్పీడున్నోడు ‘ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ సినిమాలో హీరోగా నటించాడు.

సాక్ష్యం సినిమా బెల్లంకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా నిలిచింది. ఇక కవచంలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా, సీతలో అమాయకం అబ్బాయిగా కనిపించాడు. అతడు నటించిన రాక్షసుడు సినిమా సూపర్ హిట్టయింది. ప్రస్తుతం అల్లుడు అదుర్స్ అనే సినిమాతో మరో హిట్ పై కన్నేశాడు ఈ హీరో.

సంబంధిత వార్తలు