అశోక్ జి

Thursday,March 09,2017 - 07:08 by Z_CLU

అశోక్ ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు…టి.కృష్ణ దర్శకత్వం వహించిన ‘రేపటి పౌరులు’ సినిమాతో బాల నటుడిగా పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత 15 సినిమాలలో బాల నటుడిగా నటించి తర్వాత కూచిపూడి డాన్స్ నేర్చుకొని ఇండియన్ క్లాసిక్ డాన్సర్ గా గుర్తింపు అందుకున్నారు. 1997 లో డాన్స్ అసిస్టెంట్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. దాదాపు ౩౦౦ సినిమాలకు డాన్స్ విభాగంలో పనిచేసి ‘ఆకాశ రామన్న’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.. ఈ సినిమా తర్వాత నాని కథానాయకుడిగా తెరకెక్కిన ‘పిల్ల జమిందార్’ సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ సాధించి మంచి గుర్తింపు అందుకున్నారు.. ఆ తర్వాత ఆది కథానాయకుడిగా తెరకెక్కిన ‘సుకుమారుడు’, అంజలి కథానాయికగా తెరకెక్కిన ‘చిత్రాంగద’ సినిమాలకు దర్శకత్వం వహించారు.  ఈ సినిమాల తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు,తమిళ్ భాషల్లో  తెరకెక్కిన ‘భాగమతి’ సినిమాకు దర్శకత్వం వహించాడు.

సంబంధించిన చిత్రం