శృతి హాసన్

Monday,June 06,2016 - 11:36 by Z_CLU

శృతి హాసన్ జనవరి 28,1986 లో చెన్నై(తమిళనాడు) లో జన్మించారు. శృతి హాసన్ ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తె. 2009 లో హిందీ చిత్రం ‘లక్’ తో కథానాయికగా పరిచయం అయ్యారు. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రం లో నటించిన శృతి హాసన్ 2011 లో ‘7 ఆమ్ అరివు’ చిత్రం తో తమిళ్ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తరువాత 2012 లో శృతి హాసన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ ఘన విజయం సాధించి శృతికు స్టార్ ఇమేజ్ అందించింది.
ఈ చిత్రం తరువాత ‘బలుపు’,’ఎవడు’, ‘పులి’,’రేసు గుర్రం’ చిత్రాల్లో నటించిన శ్రుతి హాసన్ ‘శ్రీమంతుడు’ తో మరో ఘన విజయం అందుకున్నారు. సంగీతం మీద ఆసక్తి తో పలు చిత్రాల్లో నేపధ్య గాయని గా పాటలు పాడారు. ఇటీవలే ప్రేమమ్ చిత్రం లో నటించిన శృతి హాసన్ ప్రస్తుతం ‘శెభాష్ నాయుడు’, ‘కాటమరాయుడు’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు.

Born : 28 January 1986

సంబంధిత వార్తలు