అనుష్క శెట్టి

Thursday,November 17,2016 - 03:31 by Z_CLU

అనుష్క శెట్టి నవంబర్ 7 , 1981 కర్ణాటక లోని మంగుళూరు సిటీ లో జన్మించారు. అనుష్క మొదట యోగ టీచర్. నాగార్జున కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘సూపర్’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం లో రెండో కథానాయికగా నటించారు. తరువాత ‘మహానంది’ చిత్రం లో నటించిన అనుష్క ‘విక్రమార్కుడు’ చిత్రం కథానాయికగా గుర్తింపు అందుకోవడం తో పాటు ఘన విజయం అందుకున్నారు. ఈ చిత్రం తారువాత ‘అస్త్రం’ లో నటించిన అనుష్క ‘రెండు’ చిత్రం తో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈచిత్రం తరువాత అనుష్క తెలుగు లో ‘లక్ష్యం’,’డాన్’,’ఒక్క మగాడు’,’స్వాగతం’,’బలాదూర్’,’శౌర్యం ‘,’చింతకాయల రవి’,’చింతకాయల రవి’ చిత్రాల్లో కథానాయికగా నటించారు. ‘అరుంధతి’ చిత్రం కథానాయికగా ఘన విజయం సాధించారు. తమిళ్ లో ‘వేట్టైక్కారన్’,’సింగం’ వంటి చిత్రాల్లో కథానాయికగానటించారు.ఈచిత్రాలతరువత’బిల్లా’,’పంచాక్షరీ’,’ఖలేజా’,’ఢమరుకం’,’మిర్చి’ వంటి పలు చిత్రాల్లో కథానాయికగా నటించారు. ‘వేదం’ చిత్రం లో వేశ్య గా నటించి విశ్లేషకులను సైతం ఆకట్టుకున్నారు. అనుష్క జానపద చిత్రం ‘బాహుబలి’ చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’ చిత్రాలతో కథానాయికగా గొప్ప గుర్తింపు అందుకున్నారు. ప్రస్తుతం’బాహుబలి-2′,’సింగం-3′,’ఓంనమోవెంకటేశాయ’,’భాగమతి’సినిమాలలో కథానాయికగా నటిస్తున్నారు.

Born : November 7, 1981

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు