ఆది పినిశెట్టి

Thursday,June 15,2017 - 07:04 by Z_CLU

ఆది పినిశెట్టి తెలుగు,తమిళ నటుడు. ఆది ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు. తేజ దర్శకత్వం వహించిన ‘ఒక వి చిత్రం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత ‘మిఱుగం’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణంలో తెరకెక్కిన ‘యీరం’ సినిమాతో తమిళ్లో నటుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. ఆ తర్వాత తమిళ్ లో ‘ఆడు పులి’,’అరవాన్’,’వల్లినం’ వంటి పలు సినిమాల్లో నటించాడు. తెలుగు లో గుండెల్లో గోదారి’,’మలుపు’,’సరైనోడు’ వంటి సినిమాలతో గుర్తింపు అందుకున్నాడు.