ఏ.ఆర్ రెహ్మాన్

Tuesday,May 23,2017 - 07:03 by Z_CLU

అల్లా రఖా రెహ్మాన్ ప్రముఖ భారతదేశ సంగీత దర్శకుడు. రెహ్మాన్ తమిళ్, తెలుగు, హిందీ భాషలతో పాటు పలు భాషా సినిమాలకు సంగీతం అందించి ఎన్నో విజయాలు అందుకున్నారు. 6 జనవరి 1967లో జన్మించారు. రెహ్మాన్ ఇప్పటి వరకూ రెండు అకాడమీ అవార్డ్స్ , రెండు గ్రామీ అవార్డ్స్,బి.ఏ.ఎఫ్.టి.ఏ అవార్డు, గోల్డెన్ గ్లోబ్, నాలుగు నేషనల్ అవార్డులు, పదిహేను ఫిలిం ఫేర్ అవార్డులు, పదిహేను ఫిలిం ఫేర్ సౌత్ అవార్డులతో పాటు పలు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. 2010లో భారత దేశ ప్రభుత్వం రెహ్మాన్ ను పద్మ భూషణ్ అవార్డును అందించారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోజా’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన రెహ్మాన్ తొలి సినిమాతోనే సంగీత దర్శకుడిగా గుర్తింపు అందుకొని పాటలతో అలరించాడు. ఈ సినిమాతో తర్వాత జెంటిల్ మెన్, బొంబాయి, మిస్టర్ రోమియో,జీన్స్, జోడి, లగాన్, సఖియా, భారతీయుడు, ఒకే ఒక్కడు,శివాజీ,రోబో, ఐ,కాదల్ వంటి సినిమాలతో సంగీత దర్శకుడిగా ఎంతో గుర్తింపు అందుకొని సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నాడు.

సంబంధిత వార్తలు